మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను గురువారం కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. ఇటీవల తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ మరణించగా, నేడు కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ఆదర్శ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి పరామర్శించారు. ధైర్యంగా వుండాలని ,,కార్మికుల సంక్షేమానికి శంకర్ యాదవ్ చేసిన సేవలను ఈ సందర్భంగా మాధవరం కొనియాడారు.ఆయన వెంట బేగంపేట కు చెందిన బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు శ్రీవారి తదితరులు ఉన్నారు.

