పర్యావరణ పరిరక్ష ణలో బాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని హెచ్ఎం పోలంరెడ్డి సుబ్బారెడ్డి అన్నారు. తాళ్లూరు మండలంలోని వెలుగువా రిపాలెం ప్రభుత్వ పాఠశాలలో గురువారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో మొక్కలు నాటి వాటిని పెంచే బాధ్యతలను ఉపాధ్యాయులు, విద్యార్థులు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్ తరాలకు మొక్కలు నాటడం చాలా అవ సరం అన్నారు. ఉపాధ్యాయులు పరకాల మస్తాన్, విద్యార్థులు పాల్గొన్నారు.

