జ్యూట్ బ్యాగులు ,టైలరింగ్ లో గత ఆరు నెలల నుంచి శిక్షణ లో ఉండి పూర్తి చేసుకున్న భగవంతా పూర్ మహిళా గ్రూప్ సభ్యులకు శనివారం జన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జన శిక్షణ సంస్థ హైదరాబాద్ జిల్లా కోఆర్డినేటర్ మాలకొండయ్య మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఇలాంటి శిక్షణ ఎంతగానో ఉపయోగపదుతుందని అన్నారు. భగవంతుపూర్ మహిళలకు జ్యూట్ బ్యాగులు తయారీ ,టైలరింగ్ లో శిక్షణ పూర్తి చేసుకున్నారని రానున్న కాలంలో మరికొందరికి ఇలాంటి అవకాశం కల్పించనున్నట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో అప్సర సంస్థ కోఆర్డినేటర్ బసవరాజ్ శిక్షకులు వరలక్ష్మి రాజేశ్వరి లతో పాటు బస్తీ కమిటీ అధ్యక్షులు శ్యాంసుందర్, దయాకర్ రెడ్డి, దర్గా కరుణాకర్, జ్ఞానేశ్వర్ ,నరసింహ తదితరులు పాల్గొని మహిళలను అభినందించారు ఈ కార్యక్రమంలో ఇంకా రూపకళా హేమలత సుమలత నిర్మల అన్నపూర్ణ వందన పల్లవి అనిత తదితరులు పాల్గొన్నారు.
