రాష్ట్రంలో రాహుల్ ప్రియాంక గాంధీ సేన కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేయాలని ,బూతు స్థాయి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయి వరకు ప్రతి
ఒక్కరు కష్టపడి పార్టీకి అండగా నిలవాలని రాహుల్ ప్రియాంక గాంధీ సేన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫయాజ్ పిలుపునిచ్చారు. బేగంపేట పాటిగడ్డలోని కార్యాలయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో మహమ్మద్ ఫయాజ్ వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒకటొకటిగా అమలు చేస్తుందని ఇదే సమయంలో రాహుల్ ప్రియాంక గాంధీ సేన కాంగ్రెస్ బూత్ మండల స్థాయి జిల్లా స్థాయి కమిటీలు మరింత బలోపేతంగా తయారవ్వాలని పార్టీకి ప్రతి విషయంలో సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు .అక్టోబర్ నెల చివరివారంలో రాహుల్ ప్రియాంక గాంధీ సేన కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో రాహుల్ ప్రియాంక గాంధీ ఆహ్వానించనున్నట్లు మహమ్మద్ ఫయాజ్ తెలియ చేశారు. అలాగే ప్రతి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రాహుల్ ప్రియాంక గాంధీ సేన కాంగ్రెస్ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రజలకు వివరించాలని కోరారు. ఈ సమావేశంలో నల్గొండ, మహబూబాబాద్, మిర్యాలగూడ ,కరీంనగర్, పెద్దపల్లి ,హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు గౌస్ బాలు నాయక్ రమేష్ ఎద్దుల శ్రీనివాసరావు బాలస్వామి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఇర్షద్ పర్వీన్ నగర జాయింట్ సెక్రెటరీ రాజేష్ శెట్టి కన్వీనర్ నరసింహ అశోక్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.


