ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్డీఏ కూటమి ఎన్నికల వాగ్దాన నిమిత్తం ఒకటో తారీకు ఉదయాన్నే ఉదయం 5:30 నుండి పింఛన్ల పంపిణీ చేయటం శుభ పరిణామం. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏ వీధిలో చూసినా పండగ వాతావరణం కనబడుతూ ఉంది.
ఒంగోలు అసెంబ్లీ పరిధిలో ఒంగోలు ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో స్థానిక 27వ డివిజన్లో సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం నాయకులు 27వ డివిజన్ యూనిట్ క్లస్టర్ ఇంచార్జ్ పప్పు శ్రీనివాసరావు భూత్ ఇంచార్జ్ వాకాటి వెంకటేష్ తదితర భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా నాయకులు ధనిశెట్టి రాము తదితర నాయకులు కార్యకర్తలు, పాల్గొని ప్రతి ఒక్కరికి వస్తానయ్యా లేదా అని పర్యవేక్షణ చేసుకుంటూ అక్కడ ఉన్న స్థానిక సమస్యల మీద కూడా దృష్టి పెడుతూ ప్రజలతో మమేకమవుతూ స్థానిక అధికారులకు చేదోడవదుడుగా ఉంటే పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు.

