ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రధాని మోదీ ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరు మీద ఒక మొక్క నాటాలని “ఏక్ పేడ్ మా కే నామ్” పేరుతో పిలుపునిచ్చారని భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బి విజయ రావు తెలిపారు.
ఈ ఆదివారం సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో మూడు నెలల విరామం తర్వాత ప్రధాని మోదీ తమ మనసులోని మాట “మన్ కీ బాత్ – 111వ ఎపిసోడ్” ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రజలతో పంచుకొన్నారు. ఆ కార్యక్రమాన్ని బి. విజయరావు మహిళా మోర్చా నాయకులతో తమ ఇంట వీక్షించారు.
ఈ సందర్భముగా విజయరావు మోదీ మనసులోని మాటను వివరిస్తూ… 10వ ప్రపంచ యోగా దినోత్సవమును ఘనంగా జరుపుకొన్నామని, జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారని తెలిపారు. పరాయి పాలకుల దౌర్జన్యాలను తీవ్రంగా వ్యతిరేకించిన పరాక్రమశాలులు సిద్ధో-కాన్హుల తిరుగులేని ధైర్యంతో ముడిపడి ఉన్న హూల్ దినోత్సవమును ఆదివాసీ సోదర సోదరీ మణులు జూన్ 30న జరుపుకొంటారని ప్రధాని వివరించారు. ధైర్యవంతులైన సిద్ధో- కాన్హు ల త్యాగం ఇప్పటికీ దేశప్రజలకు స్ఫూర్తినిస్తుందని ప్రధాని తెలిపారన్నారు.
చరిత్రలో మరుగుపడిపోయిన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రధాని ప్రతినెల తమ మంకీ బాతులో వివరిస్తున్నారని విజయ రావు తెలిపారు.
భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా ఇంచార్జి& జిల్లా కార్యదర్శి తీగల సత్యవతి, మహిళా మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యురాలు ధనిశెట్టి పావని, దేవరపల్లి శ్రీలక్ష్మి, మద్దు అరవింద లక్ష్మి, శ్రీనివాసరావు, మాధవ తదితరులు మన్ కీ బాత్ వీక్షించారు.


