సుస్థిర వ్యవసాయ పద్ధతుల ద్వారా పెరటి తోటలు పెంచుకోవడం ద్వారా కూరగాయలు ,ఆకుకూరలు విత్తనాలను తమ పెరట్లో వేసుకొని రసాయనిక ఎరువులు, పురుగు మందులు ప్రమేయం లేకుండా సేంద్రీయ పద్దతులతో పండించి న ఆరోగ్యకరమైన కూరగాయలు, ఆకుకూరలు ఆహారంగా తీసుకోవాలని దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన పంటల శాస్త్రవేత్త డాక్టర్ ఎం శివ తెలియజేశారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ రీజినల్ కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు అధ్యక్షతన తాళ్లూరు మండలం దారం వారిపాలెం గ్రామంలో 50 ఎస్సీ కుటుంబాలకు పెరటి తోట విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడినారు. కెవికె హోమ్ విజ్ఞానశాస్త్రవేత్త టి .మానస మాట్లాడుతూ చిరుధాన్యాలు వాడకం ద్వారా మహిళలు సాధికారత మరియు పెరటి తోట పెంపకం పై అవగాహన పెంచుకొని దీర్ఘకాలికంగా మహిళలు ఆరోగ్య సమస్యలపై శాశ్వతమైన విముక్తి పొందడానికి సహజ పద్ధతిలో పెరటి తోటల కూరగాయలు ఎంతో ఉపయోగంగా ఉంటాయని, రసాయనిక ఎరువులు,పురుగుమందులను నిషేధించి సుస్థిర వ్యవసాయ పద్ధతులు పాటించాలనిపురుగు మందులు వాడకుండా పండించిన కూరగాయలు, వినియోగించుకోవాలని ఆమె అన్నారు. డిబిఆర్సి రీజన్ కో-ఆర్డినేటర్ దార్ల కోటేశ్వర రావు మాట్లాడుతూ సుస్థిర వ్యవసాయ పద్ధతులు పండించుకొని మంచి ఆరోగ్యకరంగా జీవించాలని ఆయన రైతులకు తెలియజేశారు.ఈ కార్యక్రమం అనంతరం 10 మంది ఎస్సీ రైతులు పొలాల్లో భూసార పరీక్షలు నిర్వహించి మట్టి నమూనాలు సేకరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో డి బి ఆర్ సి , ఏరియా కోఆర్డినేటర్ గోపనబోయిన వెంకట్రావు, జి రోశయ్య, కుంచాల దాసు,గ్రామస్తులు పాల్గొన్నారు.

