ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాయామం చేయాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం రాంగోపాల్ పేట డివిజన్ పరిధిలోని చుట్టల బస్తీ గ్రౌండ్ కమ్యూనిటీ హాల్ లో 9.50 లక్షలు తో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ ను కార్పొరేటర్ చీర సుచిత్ర తో కలిసి తలసాని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా ఉండే యువత ఈ జిమ్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పక్కనే ఉన్న వ్యాయామశాల దంగల్ ను సందర్శించి పరిశీలించారు భవనం శిథిలావస్థకు చేరుకుందని ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు ఎంతో చరిత్ర కలిగిన ఈ వ్యాయామశాల అభివృద్ధి కోసం ఓ కమిటీ నీ ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులను తలసాని ఆదేశించారు అదేవిధంగా టాయిలెట్లు అదనపు గది నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు అదేవిధంగా గ్రౌండ్ లో మొక్కలు నాటడం ఇతర అభివృద్ధి పనులు చేపట్టి ఆకర్షనీయంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.సేవరేజి సమస్యను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలుపై ప్రతిపాదనలు అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ గౌడ్ డిసి సమ్మయ్య ఈఈ సుదర్శన్ వాటర్ వర్క్స్ జిఎం వినోద్ శానిటేషన్ డీఈ శ్రీనివాస్ టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్ నాయకులు కిషోర్ ఆంజనేయులు, విజయ్ మహేష్ బస్సివాసులు సతీష్ కిరణ్ వెంకట్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

