బేగంపేట్ డివిజన్ పరిధిలోని బ్రాహ్మణవాడిలో బుధవారం మాజీ ఎమ్మెల్యే ,బిజెపి నాయకులు మర్రి శశిధర్ రెడ్డి స్థానిక బిజెపి నాయకులు నెమలి ఆనంద్ నందు తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు ఇటీవల కాలంలో జలమండలి ఆధ్వర్యంలో డ్రైనేజీ పైప్ లైన్ పనులు చేపట్టారని పనులు పూర్తయినా వ్యర్ధాలను తొలగించలేదని, రోడ్డును తవ్వి వదిలేయడంతో తాము ఇబ్బందులు పడుతున్నామంటూ మహిళలు మర్రి కి వివరించారు. స్పందించిన మర్రి శశి ధర్ రెడ్డి జలమండలి అధికారులకు ఫోన్ చేసి సమస్యను వివరించారు . వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న జలమండలి జిఎం వినోద్ ప్రకాష్ నగర్ వాటర్ వర్క్స్ మేనేజర్ వెంకటరెడ్డి జిహెచ్ఎంసి డిఇ సంతోష్ లు రెండు రోజుల్లో నిర్మాణ వ్యర్ధాలను తొలగిస్తామని ఆ తర్వాత రోడ్డు నిర్మాణం పనులు మొదలు పెడతామని చెప్పారు పనులు జరగకుంటే తను మరోసారి ఆ ప్రాంతాన్ని సందర్శించి స్థానికులతో ఆందోళన చేపడతానని మర్రి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మర్రి వెంట బిజెపి సీనియర్ నాయకులు ఆనంద్ డివిజన్ అధ్యక్షులు మహేష్ అంజిబాబు యాదగిరి శ్రీనివాస్ రామచందర్ మంగమ్మ సత్తమ్మ సురేందర్‌రెడ్డి గుంటి సత్యనారాయణ విజయ్ కుమార్ వికాస్ నరేష్ కిట్టు పార్సి పరమేష్ తదితరులు పాల్గొన్నారు

