ఆటోలలో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తే ఇక జైలుకెళ్లడం ఖాయమని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎసిపి జి శంకర్ రాజు హెచ్చరించారు. బుధవారం కంటోన్మెంట్ పరిధిలోని తివోలీ బోల్టన్ స్కూల్ విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాల గురించి ఆయన వివరించారు .ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చిన్ననాటి నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలన్నారు .రోడ్డు భద్రత, నియమాలు, ప్రమాదాల నివారణ ,అనే అంశంపై విద్యార్థులకు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆటోలో నిబంధనల మేరకు మాత్రమే విద్యార్థులను తరలించాలన్నారు .డ్రైవర్ మద్యం సేవించి వుంటే అలాంటి ఆటోల్లో ప్రయాణం చేయవద్దని ఆయన సూచించారు .స్కూల్ యాజమాన్యం కూడా ఇలాంటి ఆటోలపై నిఘా ఉంచాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు .రోడ్డు భద్రత నియమాల గురించి విద్యార్థులకు బోధనా అంశాల్లో కూడా చేర్చాలని ఆయన కోరారు .రహదారులపై క్రమశిక్షణగా వ్యవహరించాలన్నారు. చిన్నతనం నుంచే విద్యార్థులు ట్రాఫిక్ పై అవగాహన పెంచుకొని వాటిని పాటించాలన్నారు .ఫుట్ పాత్ లను ఉపయోగించుకోవాలన్నారు వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ప్రిన్సిపాల్ సుభాషిని రావు, గాయత్రి దేవి, వైస్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, క్యాంపస్ ఇన్చార్జి వరప్రసాద్, అమితేష్ ,పిఈటి ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.


