చిన్ననాటి నుంచి పెద్దయ్య వరకు ప్రతి ఒక్కరిని పెంచి వారికి విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నతంగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని వారిని హోమ్ లో చేర్పించవద్దని రిటైర్డ్ హెచ్ఎం రఘు సతీష్ కుమార్ అన్నారు. మణికొండ లోని ఎస్ ఆర్ ఆర్ ఓల్డ్ ఏజ్ హోమును సతీష్ కుమార్ బుధవారం సందర్శించారు ఈ సందర్భంగా అక్కడ ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు ఆయన పండ్లు ప్లేట్లు పేస్టులు, బ్రష్లు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లి తండ్రి చిన్నతనం నుంచి పెంచి పెద్ద జేసిన తల్లి దండ్రులను కొందరు నిర్లక్ష్యం గా ఓల్డ్ యేజ్ హోం లలో వదిలి వెళుతున్నారని.ఎలా చేయవద్దని కోరారు.తనకు తోచిన విధంగా వారికి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.హోం లో వుంటున్న 30 మందికి టూత్ బ్రష్ లు, టంగ్ క్లీనర్లు,సబ్బులు, పేస్టు లు,రగ్గులు ,పలు రకాల పండ్లు సతీష్ కుమార్ వారికి పంచారు.ప్లేట్లు .గిన్నెలు కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సభ్యులు తిప్పరాజు రమేష్ బాబు,కాలనీ ప్రెసిడెంట్ పెంటారెడ్డి,భారతీయ వికాస్ ఆర్యభట్ట శాఖ సురేంద్రరెడ్డి ,
ఫనేందర్,అంజనా దేవి,సుగుణ,రామాంజనేయులు,రమేష్, గో వర్ధనరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.



