ప్రపంచ మెకానికల్ దినోత్సవం బుధవారం నాడు బోయిన్ పల్లిలో టూ వీలర్స్ మెకానికల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోయిన్ పల్లి కంసారీ బజార్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు.మెకానిక్ లు కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధి డి. శ్రీనివాస్ మెకానిక్ మాట్లాడుతూ మెకానికల్ అనేది శక్తి , కదలికలను కలిగి ఉండే భౌతిక యంత్రాల అధ్యయనం అన్నారు.ప్రపంచ మెకానిక్స్ డే అనేది మెకానిక్ నిపుణులు అందించే సేవను గుర్తించడానికి కేటాయించిన రోజు అని డి. శ్రీనివాస్ అన్నారు. మెకానిక్ లు అందరూ ఒకచోట కలిసి కేక్ కట్ చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బోయినపల్లి టూవీలర్ మెకానికల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం.మహేష్ జనరల్ సెక్రెటరీ ఎం.డి హైమదు హుస్సేన్, ట్రెజరీ సిహెచ్.మురళి రెడ్డి, డి.శ్రీనివాస్, వేణు,డేవిడ్,రఫ్రా తదితరులు పాల్గొన్నారు.
