ప్రభుత్వం నాసి రకం రోయ్య పిల్లలను రైతులకు సరఫరా కాకుండా చూడాలి నష్టపోయిన రైతులను ఆదుకోవాల- జిల్లా రొయ్యల రైతు సంఘం నాయకుల విన్నపం

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రొయ్యల రైతులకు నాసిరకం మోనో డాన్ బ్లాక్ టైగర్ రోయ్య పిల్లలను హేచ్చరీల నుండి సరఫరా కాకుండా ప్రభుత్వం, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రోయ్యల రైతు సంఘం డిమాండ్ చేసారు. సంఘ కార్యాలయంలో బుధవారం జిల్లా రోయ్యల రైతు సంఘ అధ్యక్షుడు దుగ్గినేని గోపి నాథ్ అధ్యక్షన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దుగ్గినేని గోపి నాథ్ మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లా పరధిలో 27వేల ఎకరాల్లో రైతులు రోయ్యల చెరువులు సాగు చేస్తున్నారని, గత ఐదు సంవత్సరాలుఆ జిల్లాలో రైతులు వెనామీ రకం రోయ్యలు పండించి గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ఈ పరిస్థితులలో గత రెండు సంవత్సరాలుగా జిల్లాలో సుమారు 12 వేల ఎకరాల్లో రైతులు మోనో డాన్ బ్లాక్ టైగర్ అను రకం రోయ్యల సాగుకు మొగ్గుచూపారని చెప్పారు. ప్రస్తుతం వేసవిలో సాగు చేసిన రోయ్యల చెరువులలో మోనో డాన్ బ్లాక్ టైగర్ రోయ్య పిల్లలను హేచరీస్ నాసిరకం సరఫరా చేసినందున అవి సక్రమంగా ఎదుగుదల లేక తీవ్రంగా నష్టపోయారని అన్నారు. వర్షాకాలంలో రైతులు తమ చెరువులను సాగుకు సిద్ధం చేసుకుంటున్నారని అన్నారు. అయితే గత అనుభవాల దృష్ట్యా ఏ రకం రొయ్యలు సాగు చెయ్యాలో తెలియని ఆయోమయ స్థితిలో రైతులు ఉన్నారని అన్నారు. ఈ పరిస్థితులలో ప్రజా ప్రతినిధులు, అధికారులు జోక్యం చేసుకుని రోయ్యల రైతులకు నాణ్యమైన మోనో డాన్ బ్లాక్ టైగర్ రొయ్య పిల్లలు హేచరీస్ నుంచి సరఫరా అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా వేసవిలో సాగు చేసి నష్టపోయిన రైతులకు హేచరీస్ నుండి నష్టపరిహారం ఇప్పిండడానికి తగిన చర్యలు తీసుకోవాలని రోయ్యల రైతు సంఘం తీర్మానించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *