అధికార మార్పిడి తర్వాత మొదటి సారిగా జరిగిన సర్వసభ్య సమావేశం శుక్రవారం ఉత్కంఠ పరిస్థిల మధ్య జరిగాయి. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిలు హాజరు కానుండటంతో అధికార పార్టీలో చేరిన ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు తన అనుచర గణంకు సమాచారం ఇవ్వటంతో మండల ప్రజా పరిషత్ ప్రాంగణంలో అధిక సంఖ్యలో టిడిపి నాయకులు చేరారు. ముందుగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిలు పార్టీ కార్యాలయంలో నాయకులతో సమావేశమై తర్వాత సర్వసభ్య సమావేశానికి వచ్చారు. అప్పటి వరకు ఎంపీపీ తన ఛాంబర్లో టిడిపి నాయకులతో సమావేశమై చర్చించుకున్నారు.సభ ప్రారంభం తర్వాత ఎంపీపీ అధ్యక్షతన సభ ప్రారంభం కాగా ప్రొటోకాల్ ప్రకారం సభా వేదికపై ఉండే విధంగా చూడాలని ఎంపీడీఓ కెవై కీర్తిని ఎంపీపీ కోరారు. దీంతో వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి గత పది సంవత్సరాలుగా తాను వేదికపైనే ఉండి సమస్యలపై చర్చించానని అప్పుడు ఎంపీపీగా ఎందుకు అడ్డుచెప్పలేదని ప్రశ్నించారు. దీంతో ఎంపీపీ అప్పుడు ఇష్టం ఉన్నది… ఇప్పడు లేదూ
ఆంటూ నేరుగా చెప్పటంతో వైస్ ఎంపీపీ సభ ముందుకు వెళ్లి ఆశీనులైనారు. గతంలో ఎంతో అన్యోన్యంగా ఉండే ఎంపీపీ, వైస్ ఎంపీపీలు ఎన్నికలలో ఎంపీపీ పార్టీ మారటంతో పొరపొచ్చాలు వచ్చాయి. దీంతో ఎంతో స్నేహం కాస్త వైరంగా మారటంపై మండలంలో తీవ్ర చర్చాంశనీయమైనది. అదే విధంగా జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ మెంబన్ సోము వీరాంజనేయ రెడ్డి (అనిల్ రెడ్డి)ని సైతం సభలోనికి ఎందుకు వచ్చావని ఎంపీపీ ప్రశ్నించటంతో కొంత సేపు వాదులాట జరిగింది. తనకు సమావేశానికి హాజరు కావాలని నోటీస్ పంపారు కాబట్టే వచ్చాని చెప్పటంతో సభ్యులు సర్ది చెప్పటంతో వివాదం సర్దుమణిగింది.
తక్కువ సంఖ్యలో హాజరైన అధికారులు ….
సర్వ సభ్యసమావేశాలకు దాదాపు అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుఅవుతావు. అయితే శుక్రవారం జరిగిన సభలో నలుగురు మండల స్థాయి అధికారులు మాత్రమే హాజరు అయ్యాయి. దీనిపై ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికారులు అనారోగ్యంగా ఉన్నట్లు తనకు సమాచారం ఇచ్చారని సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. సరియైన సమాచారం లేక … సభకు హాజరు కాని జెడ్పీటీసీ మారం… సర్వసభ్య సమావేశానికి జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిలు వస్తున్నట్లు ఆయన వ్యక్తి గత సహాయకులు సమాచారం ఇస్తూ స్థానిక విలేకరులకు, నాయకులకు సమాచారం ఇస్తూ చివరి ప్రాధాన్యంగా జెడ్పీటీసీకి సమాచారం ఇవ్వటం ఈలోపు సంబంధిత విలేకరులు జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డికి ఫోన్ చేసి మీ జిల్లాపరిషత్ చైర్ పర్సన్, ఎమ్మెల్యే వస్తున్నారంట కదా ? అని అడగటంతో నాకు ఇప్పటి వరకు సమాచారం లేదని
సమాధానం చెప్పటం… తర్వాత కొన్ని గంటల తర్వాత ఆయనకు సమాచారం రావటంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. దీంతో ఆయన వ్యక్తి గత పనులపై నెల్లూరి వెళ్లినట్లు తెలిసింది.
అయితే ఇప్పటి వరకు జరిగిన సర్వసభ్య సమావేశాలకు జెడ్పీటీసీ గైర్హజరు కావటం చాలా అరుదుగా జరిగింది. కేవలం ఇది రెండవ సారి మాతరమే కావటం గమనార్హం.వైస్ ఎంపీపీ -2 దారం ప్రియాంక నాగార్జున రెడ్డి కూడా గైర్హాజరయ్యారు.
పగడ్బందీగా బందోబస్తు
సర్వసభ్య సమావేశం నేపధ్యంలో వైఎస్సార్స్పీ, టిడిపి నాయకులు అధిక సంఖ్యలో గుమికూటటంతో ఎస్సై విజయ్ కుమార్ పగడ్బందీగా బందోబస్తు నిర్వహించారు. సర్వసభ్య సమావేశ మందిరంలోనికి కేవలం అర్హత ఉన్న వారిని మాత్రమే పంపటంతో, ఇతర సభ్యులను ఎవరిని ఆ ప్రాంతానికి పోనివ్వకుండా చూసారు.

