వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు చెక్కుల అందజేత -చెక్కులు అందిస్తున్న దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి

ఎన్నికల ఫలితాల అనంతరం దర్శి నియో జకవర్గంలో టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు శుక్రవారం ఆర్థికసాయం చెక్కులు పంపిణీ చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి గురువారం దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెం కాయమ్మలకు చెక్కులు అందజేశారు. వాటిని శుక్రవారం దర్శి నియోజకవర్గంలోని బాధిత కార్యకర్తలకు ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పంపిణీ చేశారు. తూర్పువీరాయపాలెం గ్రామం లో టీడీపీ దాడిలో గాయపడిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ముప్పరాజు కోటేశ్వరమ్మ, ముప్పరాజు వెంకటేశ్వర్లుకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున అందజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *