ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని వాటిని సంరక్షించి భావితరాలకు పర్యావరణాన్ని అందించాలని రాంగోపాల్‌పేట కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ అన్నారు మహాత్మా గాంధీ రోడ్డు లోని ఓ పాఠశాలలో శనివారం ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సుచిత్ర మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక మొక్కని నాటి దానిని సంరక్షిస్తే అది భవిష్యత్ తరాలకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుందని అన్నారు. పార్టీ నాయకులు శ్రీనివాస్ హరిహర ప్రవీణ్ రఘు గోపిలాల్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
