గంజాయి, డ్రగ్స్ నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలు నియంత్రణ, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి… మహిళలు మరియు చిన్న పిల్లలు భద్రతను పెంచడం ప్రధాన ధ్యేయం: జిల్లా ఎస్పీ…
ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా ఏఆర్ దామోదర్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ ని అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, అడిషనల్ ఎస్పీ (క్రైమ్ )ఎస్ వి. శ్రీధర్ రావు, ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, అన్ని సబ్ డివిజనల్ డిఎస్పీలు, సీఐలు, ఆర్ఐ లు, ఎస్సైలు మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.
