జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు కోసం కొనసాగుతున్న లాటరీ ప్రక్రియను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్
పరిశీలించారు.
లాటరీ సజావుగా జరగడానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లాలోని 171 మద్యం దుకాణాలకు లాటరీ విధానము ఒంగోలులోని అంబేద్కర్ భవనంలో జరుగుతున్న నేపధ్యంలో సోమవారం జిల్లా ఎస్పీ గారు సందర్శించి తీసుకోవలసిన జాగ్రత్తలు, బందోబస్తును పరిశీలించి పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. సజావుగా, పారదర్శకంగా జరిగేలా విధులు నిర్వర్తించాలని, సిబ్బంది అందరూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు కానీ, ట్రాఫిక్ కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, ఎలాంటి ఘటనలకు తావు లేకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వర రావు, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ కె.వి.రాఘవేంద్ర, సీఐలు, ఎస్సైలు ఉన్నారు.
