సన్న జీవాల పోషకులు తమ జీవాలకు నట్టల నివారణ మందులు తాగించి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని తాళ్లూరు పశువైద్యశాల వైద్యాధికారి డాక్టర్ వి. ప్రతాప్ రెడ్డి అన్నారు. తాళ్లూరులో సోమవారం నట్టల నివారణ మందులను గొర్రెలకు, మేకలకు తాగించారు. ఏలిక పాములు, జలగలు, బద్దె పురుగులు వల్ల గొర్రెలు, మేకలలో రోగ నిరోధక శక్తి తగ్గి రోగాల బారిన పడే అవకాశం ఉందని చెప్పారు. సన్న జీవాల పోషకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోని తమ జీవాలకు నట్టల నివారణ మందును తాగించాలని కోరారు. అనంతరం 500 జీవాలను నట్టల నివారణ మందు తాగించారు. గ్రామ టిడిపి నాయకుడు ఐ శ్రీనివాస రెడ్డి, గ్రామ పశుపోషక సహాయకులు పాల్గొన్నారు.
