రబీలో సాగు చేసిన పంటల భీమాకు ఫసల్ భీమా యోజన వర్తింపు నామ మాత్రపు రైతు వాటాతో అధిక భీమా చెల్లింపు

రబీలో సాగు చేసిన పంటలకు ప్రభుత్వం నామ మాత్రపు రైతు వాటా భీమా చెల్లింపుతో అధిక మొత్తంలో నష్టపరిహారం చెల్లింపు ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాసరావు అన్నారు. తూర్పుగంగవరం, బెల్లంకొండ వారి పాలెం, దోసకాయల పాడు గ్రామాలలో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లాలో ఆరు రకాల పంటలకు భీమా వర్తించేలా నోటిఫై చేసినట్లు చెప్పారు. వాతావరణ పరిస్థితులలో పంటలు నష్టపోతే ఆశించిన దిగుబడులు రాక పోతే ఫసల్ భీమా యోజన రైతులను ఆదుకుంటుందని చెప్పారు. ఆయా పంటలకు వచ్చే రైతుల వాటా కట్టాల్సిన ప్రీమియం, నష్టపోతే వచ్చు నగదు వివరాల పోస్టర్ ను విడుదల చేసారు. రైతులు అందరూ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఒగోలు ఎడీఏలు రమేష్, నిర్మల, వ్యవసాయాధికారి ప్రసాద రావు, విఏఏలు సుమ, భార్గవి, ప్రకృతి సాగు ఇన్చార్జి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *