పల్లవి మోడల్ స్కూల్లో ఓపెన్ హౌస్…….విద్యార్థులకు ట్రాఫిక్ సిబ్బంది వాడే పరికరాలపై అవగాహన…రోడ్డు దాటే సమయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి…………. నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి జి శంకర్ రాజు…..

పోలీస్ సంస్కరణ వారోత్సవాలలో భాగంగా తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పల్లవి మోడల్ స్కూల్ లో శనివారం విద్యార్థిని విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగముగా స్కూల్ పిల్లలకు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వాడే పరికరాల గురించి మరియు సిగ్నల్స్ గురించి రోడ్డు దాటేటప్పుడు పాటించవలసిన నియమాల తో పాటు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. అలాగే పిల్లలు కూడా చిన్నతనం నుండి ట్రాఫిక్ నియమాల గురించి అవగాహన కలిగి ప్రాణాలను కాపాడుకుంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి జి .శంకర్ రాజు తిరుమలగిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎల్ మధు బాబు, ఏఎస్ఐ రమేష్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు సూచనలు ఇచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *