కొర్రపాటి వారి పాలెం మాజీ ఉప సర్పంచి, వైసీపీ సీనియర్ నాయకుడు కొర్రపాటి హనుమంతరావు (59) ఆదివారం గుండె పోటుతో మృతి చెందాడు. ఆయన యధావిధగా ఉదయం ఆయన పనులు చేసుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. ఆయనకు భార్య, ఇరువురు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు శరత్ డీఎంసీ డైరెక్టగా పనిచేయగా, విష్ణు వైసీపీ కెవీ పాలెం జెసీఎస్ కన్వినర్గా ఉన్నారు. ఆయన మృతి పట్ల వైసీపీ నాయకులు, ప్రజా ప్రతినిథులు తీవ్ర సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభర్యులకు సానుభూతి తెలిపారు.
