43 సంవత్సరాల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు

43 సంవత్సరాల తర్వాత వికే ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు ఒక చోట కలుసుకున్నారు. చిన తనంలో వారి స్నేహం, బంధాలను గురించి నెమరు వేసుకున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితుల గురించి వారి కుటుంబం, ఆర్థిక స్థితి గతుల గురించి చర్చించుకున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ తమ తోటి స్నేహితులకు సహాయం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. తమకు చదువు చెప్పిన నాటి గురువులు వారి సేవలను గుర్తు చేసుకున్నారు. వివిధ డిపార్ట్ మెంట్స్ లో వివిధ హోదాలో ఉండి కూడ తమ స్నేహం కోసం కొంత సమయం కేటాయించి అదే బంధాలను కొనసాగించటం నేడు తరానికి ఆదర్శనీయని పెద్దలు వ్యాఖ్యానించారు. విద్యుత్ డీఈ మస్తాన్ రావు, పారిశ్రామిక వెత్తలు ఎడమ కంటి లక్ష్మి రెడ్డి, పవన్ కుమార్, ఉపాధ్యాయుడు భూమా శ్రీనివాస రావు, రాజకీయ నాయకుడు ఇడమకంటి గురువా రెడ్డి, ఫోటో గ్రాఫర్ సుబ్బయ్య, సెరికల్చర్ ఉద్యోగి ఇడమకంటి అంజి రెడ్డి, నాగేశ్వర రావు, సుబ్రమణ్యం రెడ్డి, ఫాస్టర్ అబ్రహం లింకన్ మరో 20 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఆట పాటలతో సందడిగా గడిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *