ఎన్నికల హామీలు తుంగలో తొక్కారు..-పేదలపై వేల కోట్ల విద్యుత్ భారం -దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి – వైసిపి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కిందని, పేద ప్రజలపై రూ.15,485 కోట్లు విద్యుత్ భారాలు మోపటం అన్యాయమని వై సిపి జిల్లా పార్టీ అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి విమర్శించారు. పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని ఎమ్మెల్యే డాక్టర్ డాక్టర్ బూచే పల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో దర్శిలో నిరసన
ప్రదర్శన నిర్వహించారు. స్థానిక పొదిలి రోడ్డులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ విద్యుత్ శాఖ ఎగ్జిక్యూట్ ఇంజనీరు కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. జిల్లాపరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి డాక్టర్ బూచేపల్లి ర్యాలీలో పాల్గొన్నారు. విద్యుత్ కార్యాలయం వద్ద డాక్టర్ బూచేపల్లి మాట్లాడుతూ ….రాష్ట్రంలో చంద్రబాబునాయుడు అధి కారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చారని, ఎన్ని కలు అనంతరం హామీలన్నీ మర్చిపోయి పేద ప్రజలపై భారం మోపడం సరైన పద్దతి కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక మాఫియా పాలన నడుస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు
ఎన్నికల హామీలు తుంగలో తొక్కారని,
200 యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగించాలన్నారు. అనంతరం విద్యుత్ కార్యాలయంలో ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ అధికారి ఎస్ కె.మహబూబ్ బాషాకు వైసిపి నేతలు వినతి పత్రం అందించారు. తొలుత దర్శి తహశీల్దార్ కార్యాలయం వద్ద టిడిపి వారు విద్యుత్ ఛార్జీలకు జగనే కారణం అని చిన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా దానిని వైసీపీ వారు చించివేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని వివాదం ముదరకుండా బందోబస్తు ఏర్పాటుచేశారు. నిరసన కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు వెన్నపూస వెంకటరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కుమ్మిత అంజిరెడ్డి, ఎంపీపీలు సుంకర సునీత, బ్రహ్మానందరెడ్డి, గోళ్ళపాటి సుధారాణి, అచ్చయ్య, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు కేసరి రాంభూపాల్రెడ్డి, నాయకులు మేడికొండ జయంతి, కాకర్ల కష్ణారెడ్డి, దేవప్రసాద్, కోరే చిన్నసుబ్బారావు, వెంకటేశ్వర్లు, ఇతడి దేవదానం, కెవి.రెడ్డి, కె.నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పులి ప్రసాద్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సుబ్బారావు, కొల్లా భాస్కర్, కోటేశ్వరరావు, రమణారెడ్డి, డగ్లెస్, ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *