విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన ఇట్టా వెంకట్రావు కుటుంబానికి మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి మంగళవారం నాడు తూర్పు నాయుడుపాలెం లోని తన క్యాంపు కార్యాలయంలో రూ.5 లక్షల పరిహారం అందజేశారు. కొండపి నియోజకవర్గం చిర్రికూరపాడుకు చెందిన ఇట్టా వెంకట్రావు గతేడాది అక్టోబర్ 1 న విద్యుత్ షాక్ కి గురై మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మంత్రి డోలా బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం స్పందించి రూ. 5 లక్షల పరిహారం మంజూరు జేసింది. ఈ చెక్కును నేడు మంత్రి డోలా బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు గొట్టిపాటి, డోలాకి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు .
