తాళ్లూరు మండలంలోని రామభద్రాపురంలో రీ సర్వేకు రైతులు సహకరించాలని మండల సర్వేయర్ శ్రీనివాస రావు కోరారు. సోమవారం నుండి రామభద్రాపురం రెవిన్యూ పరధిలో రీ సర్వే జరుగుతుందని చెప్పారు. రైతులకు ఇప్పటికే తెలిపామని, విఆర్ఎ ల ద్వారా నోటీసులు పంపామని తెలిపారు. రైతులు తమ పాస్ పుస్తకాలను, వారి వద్ద పొలానికి ఉన్న ఆధారాలను తీసుకురావలని చెప్పారు. ఎల్ ఎల్ ఆర్ లో ఉన్న విస్తీర్ణం, తమ పొలం ఆన్లైన్ లో ఉన్న విస్తీర్ణం, అనుభవంలో ఉన్న విస్తీర్ణం సరిపోయేలా ఉన్నాయా లేవా అన్న విషయాలను గమనించి సర్వేయర్, రెవిన్యూ సిబ్బంది దృష్టికి తీసుకురావాలని కోరారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
రీ సర్వేకు సహకరించండి
20
Jan