నీటి పంపుల మరమ్మత్తులకు మండలంలో ఈనెల 17 వరకు 16 వంచాయితీలలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీడీఓ దార హనుమంత రావు తెలిపారు. పంచాయితీలోని సహాయ ఇంజనీరు, ఆర్ డబ్ల్యు ఎస్ అధికారుల పర్యవేక్షణలో రిపేర్లు నిర్వహిస్తారని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, ప్రజలు సహకరించి ఆయా గ్రామాలలో రిపేర్లకు గురైన బోర్లను, చేతి పంపులను గుర్తించి రిపేర్లు చేయించి వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని కోరారు.
