బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తిలో బి ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి ఆరిఫ్ ఆధ్వర్యంలో జరిగిన గ్యార్వి ఉత్సవాలు సనత్
నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బేగంపేట కార్పొరేటర్ టి. మహేశ్వరి శ్రీహరితో కలిసి పాల్గొన్నారు
ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు తలసానికి ఆశీర్వాదాలు అందజేశారు. లేక 30ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని తమ బస్తీలో ఖబరస్తాన్ కు స్థలం కేటాయించేందుకు చేసిన కృషిని కొనియాడుతో తలసానికి ముస్లిం మత పెద్దలు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్తానని అన్నారు సనత్ నగర్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో సయ్యద్ అలీ ముస్తఫా జిలాని, టిఆర్ఎస్ నాయకులు టి శ్రీహరి ,శ్రీనివాస్ గౌడ్ ,నరేంద్రరావు ,షేక్ అబ్బాస్ సాబేర్ అలీ , వాహద్ తదితరులు పాల్గొన్నారు.
