జర్నలిస్ట్ ల అక్రిడేషన్లపై నూతన జీఓను విడుదల చెయ్యాలి – ప్రభుత్వం అర్హులైన వారందరికి అక్రిడేషన్లు ఇవ్వాలి – ఎపీయూడబ్యుజి రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బా రావు

రాష్ట్ర ప్రభుత్వం అక్రిడేషన్లపై నూతన జీవోను విడుదల చేసి జర్నలిస్ట్ ల అందరికి అక్రిడేషన్లు మంజూరు చెయ్యాలని అలాగే అర్హలైన జర్నలిస్ట్ ల అందరికి నివాస స్థలాలు కేటాయించాలని ఎపీయూడబ్యుజె రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బా రావు ప్రభుత్వాన్ని కోరారు. ఎపీయూడబ్యుజి జిల్లా కమిటి సమావేశం శుక్రవారం దర్శి పట్టణంలో ఎపీయూడబ్యుజె అధ్యక్షుడు ఎన్ రమణ, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు వెంకట రావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఐవీ సుబ్బా రావు మాట్లాడుతూ……. రాష్ట్రంలో జర్నలిస్ట్ ల సమస్యల పరిష్కారం కోసం అనేక దశాబ్దాలుగా రాజీ లేని పోరాటం కొనసాగిస్తున్న ఎకైక సంఘం ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఎపీయూడబ్యుజె) అని అన్నారు. అటు ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానంగా వ్యవహారిస్తూ అన్ని వర్గాల ప్రశంశలు పొందుతున్న సంఘం తమదే అని అన్నారు. జర్నలిస్ట్ ల సమస్యల పరిష్కారం కోసం ఒక వైపు పనిచేస్తూనే ……….మరో వైపు యూనియన్ సామాజిక ధృక్పధంతో అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుందని ఆయన అన్నారు. వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు యూనియన్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చెయ్యాలని ఆయన జిల్లా కమిటికి సూచించారు. అలాగే జర్నలిస్ట్ ల కుటుంబాలకు మెడికల్ క్యాంపులు కూడ నిర్వహించాలని ఆయన అన్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా రెండవ సారి ఎకగ్రీవంగా ఎన్నికైన ఐవీ సుబ్బా రావుకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, దర్శి డివిజెన్ పరిధి లోని యూనియన్ నాయకులు పూల మాలలు వేసి మెమెంటో లు ఇచ్చి ఘనంగా సన్మానించారు. అలాగే యూనియన్ రాష్ట్ర కౌల్సిల్ సభ్యులుగా ఇటీవల ఎకగ్రీవంగా ఎన్నికైన ఎ. సురేష్, అశోక్, బేతాళం శ్రీనివాస్, కాశీ రావులకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బా రావు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు.ఈ సమావేశంలో యూనియన్ జిల్లా కార్యదర్శి డి. కనకయ్య, ఎలక్ట్రానిక్ జిల్లా ఈ శంకర్, బాపట్ల జిల్లా అధ్యక్షుడు సీహెచ్ రాంబాబు, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఇస్తేకర్ బాష, యూనియన్ నాయకులు పగడాల శ్రీనివాస్, కోనూరి శ్రీనివాస్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అసోషియేషన్ ఉపాధ్యక్షుడు షేక్ బాజీ వలి, కోశాధికారి డి బాబి, యూనియన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మారెళ్ల మురళీ దర్శి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు మండలాలకు చెందిన యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *