రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాలుష్య రహిత ఆంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దే కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలని ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమం సమావేశాలను నిర్వహిస్తూ ప్రజలందరి చేత స్వచ్ఛంధ్ర ప్రతిజ్ఞను చేయిస్తున్నారు.
ఆ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు 27వ డివిజన్ పరిధిలో రాజా పానగల్ రోడ్డు లోని సచివాలయంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సమావేశం ఏర్పాటు చేశారు.
*స్వచ్ఛాంధ్రా ప్రతిజ్ఞ*
నేను, నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతి రోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాలకొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ… ఈరోజు నుండి నా తోటి వారికి కూడ స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చెయ్యటం పై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అని ప్రతి ఒక్కరూ సమావేశంలో ప్రతిజ్ఞ చేశారు.
సమాజంలో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ సంచులు వాడకం మానేద్దాం – ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ప్లాస్టిక్ పాత్రలో ఆహారం హానికరం – స్టీలు పింగాణి మట్టి పాత్రలు శ్రేయస్కరం. కాగితం గుడ్డ సంచులు వాడండి – పర్యావరణాన్ని కాపాడండి. ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను వాడకండి. ప్లాస్టిక్ వాడకం తగ్గించుకుందాం – ప్రకృతి సంపదను రక్షించుకుందాం. ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించడానికి అందరం భాగస్వాములు అవుదామంటూ ప్రతినపూనారు.
సమావేశంలో 27వ డివిజన్ కార్పొరేటర్ జడ వెంకటేష్, డివిజన్ నోడల్ అధికారి వేంకటేశ్వర్లు, డివిజన్ పరిధిలోని వివిధ విభాగ కార్యదర్శులు ఆర్ బాలకృష్ణ నాయక్ ఎన్ గోవిందరాజులు ఆర్ హరికృష్ణ వై సుమాంజనేయులు ఏం పద్మలత కె అపర్ణ రాణి జి సాయి రూపాంజలి సాగర్ కే శిరీష టీ దేవికా రాజ్యలక్ష్మి ఏ కరుణ జయలక్ష్మి ఎస్ కే ఎస్ దాని కోమలి తిరుమల అనిత భవాని ఎన్ నాగార్జున మరియు పలు పార్టీ ప్రతినిధులు తూము రాజేష్, పప్పు రాజేష్, వెంకటేశ్వర రెడ్డి, ధనిశెట్టి రామునాయుడు పాల్గొన్నారు.


