మంచి ఆరోగ్యం కోసం మంచి ఆహారం తినాలి – ప్రకృతి సాగు ఉత్పత్తుల ప్రదర్శన

మంచి ఆరోగ్యం కోసం మంచి ఆహారం తినాలని మండల టిడిపి అధ్యక్షుడు బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి కోరారు. మండల కాంప్లెక్స్ ఆవరణలో సోమవారం ప్రకృతి సాగు ఉత్పత్తుల ప్రదర్శన. అమ్మకం నిర్వహించారు. వ్యవసాయాధికారి ప్రసాద రావు మాట్లాడుతూ ఆరోగ్యం కోసం అందరూ మందులు వాడుకుంటారని ఆహార పదార్ధాలే మందుల కంటే మంచి వన్న విషయాన్ని గ్రహించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రొత్సహించాలని కోరారు. ప్రకృతి సాగు ఇన్చార్జి నరసింహులు అందుబాటులో ఉన్నారని సలహాలకు సంప్రదించాలని కోరారు. ప్రతి సోమవారం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం స్టాల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనేక మంది అధికారులు, ప్రజలు ప్రకృతి ఉత్పత్తులను కొనుగోలు చేసారు. కార్యక్రమంలో ఐ సీఆర్ ఏ లు కోటి రత్నం, వాణి, కోటి అనంత లక్ష్మి, మౌనిక పల్లవి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *