శ్రీ రాముడు ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి..రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు….మోతే శ్రీలత శోభన్ రెడ్డి….

హైదరాబాద్ ఏప్రిల్ 6(జే ఎస్ డి ఎం న్యూస్) :

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సికింద్రాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన శ్రీ సీతరాముల కళ్యాణ మహోత్సవాలలో డిప్యూటీ మేయర్ దంపతులు శ్రీలత శోభన్ రెడ్డి మరియు టీ టీ యు సీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి శ్రీ సీత రాముల ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని,కోరుకున్నారు.
ఆదివారం సికింద్రాబాద్ పరిధిలోని తార్నాక డివిజన్ లోని భజన సమాజం లాలాపేట , సిరిపురి కాలనీ, హనుమాన్ నగర, చిలకలగూడ లోని చింతబవి శ్రీ సీతారామ ఆంజనేయ సాయిబాబా శివాలయం లో జరిగిన సీతారాముల కళ్యాణోత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం లాలాపేట లోని శ్రీ సీత రామాంజనేయ భజన సమాజం వద్ద మజ్జిగ ప్యాకెట్లను భక్తులను
పంపిణీ చేశారు.
ఈ సంధర్బంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ ధర్మానికి, నీతికి,విలువలకు, సుపరిపాలనకు నిలువుటద్దం శ్రీ రాముడు అని అన్నారు, తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీ రాముడి లాగా సుపరిపాలన అందిస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం దేశం అబ్బురపడేలా పాలన కొనసాగిస్తూ దశాబ్దాల సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు.
ఆ జగదాబి రాముడి అనుగ్రహంతో ప్రజలంతా కష్టాలు తొలిగి, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాలలో స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ లాల్, రాజు, పోచయ్య , ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *