తూర్పుగంగవరం గ్రామానికి చెందిన భీ
మని కార్తిక్ టెలిఫోన్ అడ్వైజరీ కమిటి సభ్యులుగానియమిస్తూ బుధవారం ఉత్తర్వు లు జారీ చేశారు. నియామక పత్రాన్ని ఒంగోలు మాగుంట కార్యాలయంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి చేతులు మీదుగాబుధవారం అందుకున్నారు. ఈ సందర్బంగా కార్తిక్ మాట్లాడుతూ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా తన నియామకానికి సహకరించిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట తనయుడు మాగుం ట రాఘవరెడ్డి, దర్శి టీడీపీ ఇంచార్జి గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువనాయకులు లలిత్ సాగర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ యత్తపు కాశిరెడ్డి, మదార్ వలి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
