వచ్చే విద్యాసంవత్సరానికి విద్యార్ధినీ, విద్యార్థులకు శ్రీసర్వేపల్లిరాధాకృష్ణ విద్యామిత్ర సామాగ్రిని నిల్వ చేసేందుకు గుర్తించిన తాళ్లూరులోని వికెజిహెచ్ఎస్ స్టాక్ పాయింట్ ను డిప్యూటీడీఈవో చంద్రమౌళేశ్వర్ బుధవారం సందర్శించారు. గత ప్రభుత్వం అప్పటి సీఎం జగన్ ఫొటోలతో విద్యా ర్థులకు పాఠశాల సామాగ్రిని అందజేసింది. ఈ ఏడాది ప్రభుత్వం విద్యాలయాల్లో రాజకీయాలు చొప్పించకుండా వుండేందుకు ఈ ఏడాది నూతన ప్రణాళికతో సామా. గ్రిని తయారు చేసి రానున్న విద్యాసంవత్సరంలో విద్యార్థులకు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. అందులోబాగంగా స్టాక్ పాయింట్లను గుర్తించారు. ఈ కార్యక్రమ ంలో ఎంఈవో జి.సుబ్బయ్య, ఎంఈవో-2 ఎల్.సుధాకర్ తదితరులు ఉన్నారు.
