బేగంపేట ఏప్రిల్ 14(జే ఎస్ డి ఎం న్యూస్) :
అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ.. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలోని అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు తదితర వర్గాలకు సమ న్యాయం జరిగేలా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వసత్తాక సౌర్వభౌమాధికారాన్ని దక్కించుకొనేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యంగాన్ని రూపొందించారని పేర్కొన్నారు.
*బన్సీలాల్ పేట డివిజన్* లో……
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా మాజీమంత్రి, సనత్ నగర్ డివిజన్ లోని ఐ డి హెచ్ కాలనీ, బి జె ఆర్ నగర్, జబ్బార్ కాంప్లెక్స్, బన్సీలాల్ పేట మెట్ల వద్ద అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముందుగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం నిర్వహకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత, పద్మారావు నగర్ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, డివిజన్ బి ఆర్ ఎస్ అద్యక్షుడు వెంకటేషన్ రాజు, లక్ష్మీపతి, ప్రేమ్ కుమార్, గజ్జెల శ్రీనివాస్, వినోద్, శివ, సుదర్శన్ బాబు, అంగ మూతి శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి, వెంకట్ తదితరులు ఉన్నారు.
*మోండా డివిజన్* లో…..
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా డివిజన్ లోని ఆదయ్య నగర్ కమాన్ వద్ద గల అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అద్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, నాగులు, రాములు, మహేష్ యాదవ్, మహేందర్, జయరాజ్, నిర్వహకులు రాజు, ఏకాంబరం తదితరులు పాల్గొన్నారు.
*రాంగోపాల్ పేట డివిజన్* లో….
డివిజన్ లోని విక్టోరియా గంజ్ సర్కిల్ గల డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అద్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు ఆంజనేయులు, గణేష్, అర్జున్, లావణ్య, శివ, మల్లేష్, కిరణ్, మధు, దుర్గ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
*బేగంపేట డివిజన్* లో……
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డివిజన్ లోని పాటిగడ్డ ఎన్ బి టి నగర్, ఓల్డ్ కష్టమ్ బస్తీలలో నిర్వహించిన కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ టి.మహేశ్వరి, డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అద్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, నరేందర్ రావు, శేఖర్, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.




