బేగంపేట ఏప్రిల్ 16(జే ఎస్ డి ఎం న్యూస్) :
దళిత రత్న అవార్డు గ్రహితలను మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. ఈ నెల 14 వ తేదీన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా రవీంద్రభారతి లో నిర్వాహించిన సాంస్కృతిక కార్యక్రమంలో బన్సీలాల్ పేట డివిజన్ కు చెందిన 9 మంది దళిత రత్న అవార్డులను అందుకున్నారు. బుధవారం అవార్డు గ్రహీతలు వెస్ట్ మారేడ్ పల్లిలోని కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ అవార్డు గ్రహితలు ఎర్రా విజయ్ శంకర్, బండారి శివ కుమార్,త్రిషుల్ శ్రీకాంత్, కే.సుదర్శన్, కే.దినేష్, ఈ.గోపాల్ తదితరులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత, (ఎస్ సి ఆర్ పి ఎస్)ఎస్సీ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అద్యక్షుడు సుదర్శన్ బాబు, నాయకులు లక్ష్మీపతి, కుర్మ మహేందర్, రాపాక అశోక్ తదితరులు ఉన్నారు.
