రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మన మిత్ర (వాట్సాప్ గవర్నెన్స్), శక్తి యాప్ లపై క్షేత్ర స్థాయిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలి – జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మన మిత్ర (వాట్సాప్ గవర్నెన్స్), శక్తి యాప్ లపై క్షేత్ర స్థాయిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మన మిత్ర (వాట్సాప్ గవర్నెన్స్), శక్తి యాప్ లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన బ్రోచర్ ను జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జిల్లా అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, డిపిఓ వెంకట నాయుడు, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర రావు, ఇరిగేషన్ ఎస్ ఈ వరలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *