మహిళా సాధికార కమిటీ ఛైర్పర్సన్ గా దగ్గుబాటి పురందేశ్వరి – హర్షం వ్యక్తం చేసిన విజయ రావు.

పార్లమెంటు మహిళా సాధికార కమిటీ ఛైర్ పర్సన్ గా భారతీయ జనతాపార్టి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. 20 మంది లోక్ సభ, 10 మంది రాజ్యసభ సభ్యులతో ఏర్పాటైన కమిటీలో సభ్యులుగా విభిన్న పార్టీలకు చెందిన మహిళా ఎంపీలు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బి విజయ రావు దగ్గుబాటి పురందేశ్వరి కి శుభాకాంక్షలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో… భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా రాష్ట్రంలో మొన్నటి సార్వత్రిక ఎన్నికలలో గణనీయమైన శాసనసభ స్థానాలు గెలుచుకొని బిజేపి కి గట్టి పట్టుసాధించిపెట్టారని, వారి కృషి పట్టుదల మహిళ లకు స్ఫూర్తివంతమని, తెలుగింటి ఆడపడుచుగా… అటు పుట్టింటికి, మెట్టింటికి మరియు రాష్ట్రానికి వన్నె తెచ్చారని, మహిళలోకానికి ఆణిముత్యం, ఆదర్శ మహిళా నాయకురాలిగా… ఏ రంగంలో ఉన్నా తగిన గుర్తింపు తెచ్చుకోవటంలో ఆవిడ కు ఆవిడే సాటి అని, తండ్రి నందమూరి తారకరామారావు కు తగ్గ తనయ పురందేశ్వరి అని బి. విజయరావు ఈ సందర్భముగా కీర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *