జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురష్కరించుకుని మండలంలోని బెల్లం కొండవారిపాలెం సర్పంచ్ పోశం సుమలత, శ్రీకాంత్ రెడ్డి ఉత్తమ సర్పంచ్ గా ఎంపికయ్యారు. గ్రామాభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేసిన ఆమెకు ఉత్తమ సర్పంచ్ ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకున్నారు. సర్పంచ్ ను పలువురు అభినందించారు.
