ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా 50శాతం రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు అందజేస్తున్నట్లు వ్యవసాయాధికారి ప్రసాద రావు తెలిపారు. శివ రామపురం క్షేత్ర పర్యటనలో బాగంగా రైతులకు రాయితీ విత్తనాల గురించి చెప్పారు. పది కేజీల జనుములు రూ.545, జీలుగలు రూ. 615, పిల్లి పెసర రూ.900లకు ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతులు సంబంధిత రైతు సేవా కేంద్రాలలో నగదు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నాలుగు రోజులకు విత్తనాలు అందుతాయని వివరించారు.
