ఈ.వి.ఎం. గోదాములను తనిఖీ

జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు స్థానిక మామిడిపాలెంలోని ఈ.వి.ఎం. గోదాములను తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీలలో భాగంగా శుక్రవారం ఈ గోదాములను సందర్శించారు. ఈ ప్రాంగణంలో కల్పిస్తున్న భద్రత, వాటికి సంబంధించి నిర్వహిస్తున్న రికార్డులను ఆయన పరిశీలించారు. గోదాము షట్టర్లకు వేసిన తాళాలు, వాటి సీలును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట జిల్లా ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, ఇతర సిబ్బంది ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *