ఘనంగా అంతర్జాతీయ ఫైర్ ఫైటర్స్ దినోత్సవం

దరిశి లో ఎన్నెస్పీ కాలనీలోని రాష్ట్ర విపత్తు నివారణ మరియు అగ్నిమాపకశాఖ కార్యాలయం ప్రాంగణంలో దివంగత ఫైర్ ఫైటర్స్ అమరవీరులకు ఆదివారం ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ నెంబర్ మరియు మానవతాస్వ చ్చంద సేవా సంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి మాట్లడుతూ… బ్రిటీష్ పాలకు లనుండే అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రతిష్టాత్మకమైన రక్షణశాఖాపరిధిలో వున్న అగ్నిమాపక విభాగంలోని ఆనాటి గంటల బండి నుండి మొదలుకొని ఈనాటి ఫైరింజన్ వరకు అనేక చేర్పులు, మార్పులతో అధునాతన సాంకేతికను అందిపుచ్చు కొనినేడు రాష్ట్ర విపత్తు నివారణ సంస్థగా మారి దేశంలో అత్యంత కీలకమైన శాఖగా పేరుప్రఖ్యాతులుగడించి, ప్రతి నిత్యమూ అత్యంత జాగరూకతతో ఎలాంటి స్వలాభాపేక్షకు తావులేకుండా విధి నిర్వహణలో అసువులుబాసిన అంతర్జాతీయ ఫైర్ ఫైటర్స్ లోని ప్రతీ అమరవీరునికీ ఘనమైన నివాళులు అర్పించారు. వారి ఋణం తీర్చకోలేమని, ప్రాణత్యాగాలు ఎన్నటికీ మరువలేమని, దేశ ప్రజానీకం ఎప్పటికీ మరచిపోకూడదని, ఫైర్ ఫైటర్స్ త్యాగాలను కొనియాడారు. కార్యక్రమానికి ఇంచార్జి ఫైర్ ఆఫీసర్ మోజేస్ అధ్యక్షత వహించారు. ఏఐటీయూసీ నాయకులు హనుమంతరావు, ఆశా వర్కర్ సుశీలమ్మ, అగ్ని మాపక సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *