అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ అరెస్టయిన వారిలో ఎర్రచందనం స్మగ్లర్లు-రూ.85 లక్షల చోరీ సొత్తు స్వాధీనం-పోలీసులకు ఎస్పి దామోదర్ అభినందనలు

పగటి వూట గృహాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న పేరు మోసిన ఎర్రచందనం స్మగ్లర్లు, దొంగల ముఠాను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.85 లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పి ఏఆర్ దామోదర్ తెలియజేశారు. ఎస్పీ మాట్లాడుతూ ..
గత నెల 14వ తేదీన పొదిలి పట్టణం లోని బీరం నాసర్ రెడ్డి ఇంటిలో గుర్తు తెలియని దొంగలు సుమారు 27 సవర్ల బంగారం, సుమారు 2 కేజీల వెండి ఆభరణాలను దొంగలించారన్నారు. అప్రమత్తమైన పొదిలి సీఐ సిబ్బందిని వివిధ బృందాలు గా ఏర్పాటు చేసి, మొదటగా పొదిలి పట్టణంలో ఏర్పాటు చేయబడిన సిసి కెమెరాల ద్వారా ముద్దాయిలు ఏ మార్గం వైపు వెళ్ళినది, నేరం చేయుటకు ఒక తెల్లటి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కార్ అనుమానితంగా ఉండటాన్ని గుర్తించారన్నారు. ముద్దాయిలు మైదుకూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల వారు అయి ఉండొచ్చని నిర్ధాంచుకున్నారన్నారు. గత నెల 17న మధ్యాహ్నం కావలి ప్రాంతంలో దొంగతనం చేసి పారిపోతున్నట్లు సమాచారం తెలుసుకుని ఆ వాహనాన్ని గుర్తించి వెంబడిస్తుండగా ముద్దాయిలు పోలీసులను చంపి తప్పించుకోవాలని
ఉద్దేశ్యంతో వారి కారుతో పోలీసు జీపును ఢీకొట్టి చోరి సొత్తుతో పారిపోయారన్నారు. ఈ విషయాన్ని పొదిలి సిఐ ప్రొద్దుటూరు సిఐకి సమాచారం ఇచ్చి వారి కదలికలపై నిఘా పెట్టారన్నారు. విశాఖపట్నం నుంచి దర్శి మీదుగా పొదిలి వస్తున్నట్లు గుర్తించారన్నారు. పొదిలి గ్రామంలో దర్శి రోడ్ లో ని ఎస్ వికెపి కాలేజీ వద్ద వాహన తనిఖీ చేస్తుండగా ముద్దాయిల కారును గుర్తించారు. సిఐ తన సిబ్బంది ద్వారా ఆవడానికి ప్రయత్నించగా ఆపకుండా పారిపోయే క్రమంలో చెట్టును ఢీకొట్టుకొని ఉండగా సిఐ కారులోని ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పి తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ముద్దాయిలు వీరే…

ఈ కేసులో వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ముగ్గురు ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో చింపర్తి ఫక్రుద్దీన్ (35) ఖాదర్ వలి
మహబూబ్ పీరా (25) ఖాదర్ వలి, గాండ్లు లతీఫ్ భాషా (24) ప్రొద్దుటూర్ టౌన్, వైఎస్ఆర్ కడప జిల్లా అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి పై ప్రకాశం జిల్లాలో 3 కేసులు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 9 కేసులు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 3 కేసులు, అనంతపురంలో 1 కేసు, అన్నమయ్య జిల్లాలో 1 కేసు, వీటితో పాటు గతంలో నంద్యాలలో7, కడపలో 5, బేతంచర్లలో 2, తిరుపతి సిసిఎన్లో 2, చిన్న చౌక్లో 2, కోడూరులో 1. మైదుకూరులో 1, ఎర్రగుంట్లలో 1 మొత్తం 21 కేసులు నమోదయ్యాయి. ముద్దాయిలపై గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు 74 కేసు లు నమోదు అయ్యాయి.

85 లక్షల చోరీ సొత్తు స్వాధీనం

ఈ కేసుల ముద్దాయిల నుంచి సుమారు రూ. 85 లక్షల చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 9.24 కిలోల బంగారు ఆభరణాల విలువ రూ . 81 లక్షలు, 3.800 కిలోల వెండి వస్తువుల విలువ రూ. 4,20,000లు, 6 కిలోల గంజాయి, తెలుపు రంగు కారును స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులకు ఎస్ అభినందనలు

ఈ కేసులో ఉత్తమ ప్రతిభ కనపరిచిన దర్శి డిఎస్పి బి. లక్ష్మినారాయణ, కడప జిల్లా మైదుకూరు డిఎస్పి రాజేంద్ర ప్రసాద్, పొదిలి సిఐ టి. వెంకటేశ్వర్లు, మైదుకూరు రూరల్ శివశంకర్, పొదిలి ఎస్ఐఐ వి. వేమన, కొనకనమిట్ల ఎస్ఐ టి. రాజ్ కుమార్ను, ప్రొద్దుటూరు రూరల్ ఎస్సై అరుణరెడ్డి. పొదిలి, కొనకనమిట్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది మురళీ కష్ణ, షకీర్, కోటేశ్వరరావు, గురు ప్రసన్న, ఎం. అంకయ్యలను ఎస్పీ అభినందలు తెలియజేశారు. ప్రశంస పత్రాలు, రివార్డ్స్ ను ప్రకటించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *