మహంకాళి మే 6 (జే ఎస్ డి ఎం న్యూస్) :
తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ మహాకాళి అమ్మవారిని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ,స్వర్ణ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో వేద మంత్రాలతో వేద పండితులు ఆశీర్వచనం చేసి తలసాని దంపతులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం తలసాని దంపతులు బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయాల ప్రకారం తలసానీ దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికి పూజలు నిర్వహింపజేసే తీర్థప్రసాదాలు అందించారు. తలసాని దంపతులు వెంట రాంగోపాల్ పేట్ మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.



