అలివేలు మంగాపురంలో ఆల్ ఇండియా వైష్ణవ సంఘం కాన్ ఫెడరేషన్ సమావేశం.

అలివేలుమంగాపురం మే 6 (జే యస్ డి ఎం న్యూస్) :
తిరుచానూరు తిరుపతి అలివేలు మంగాపురం లో శ్రీ రామానుజాచార్యుల 1008 జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఆల్ ఇండియా వైష్ణవ సంఘం కాన్ ఫెడరేషన్ మహాసభ జరిగింది. ఈ సమావేశానికి ఆలిండియా చాత్తాద శ్రీవైష్ణవ కాన్ఫిడరేషన్ అధ్యక్షులు తిరుక్కోవల్లూరు రామానుజం, ఫైనాన్స్ సెక్రటరీ రఘు సతీష్ కుమార్, అడ్వైజర్ కర్పూరం గోపీధర్, లతో పాటు వివిధ రాష్ట్రాల నుండి సుమారు 500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాలకు చెందిన సంఘాల పెద్దలు ఆయా రాష్ట్రాల సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను వివరించారు.అనంతరం తిరుపతి సంఘం వారి ఆధ్వర్యంలో ఉచిత వివాహ వేదికను నిర్వహించారు. సాయంత్రం అలివేలుమంగాపురం మాడవీధుల్లో స్వామివారికి పుష్ప ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వరరావు ,భద్రగిరి జగదీష్ కుమార్, డీఎల్ఎం స్వామి ,ఈ లక్ష్మయ్య ,టీవీ
తో తాద్రి ,రామ్ అయ్యర్, జగదీష్ కుమార్, పి వెంకటేశ్వర్లు, ఈ. ఉమామహేశ్వరరావు, పుష్పలత, వెంకట్, భద్రగిరి హేమలత ,జి .ప్రమీల ,శ్రీకాంత్, దుర్గాప్రసాద్ ,దాస్యం వామనాచారి ,కే .పారిజాతం తిరునగరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *