ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో వచ్చే ఆర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన “మీ కోసం” కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు ఆర్.గోపాలకృష్ణ తో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వీటిని ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆమె ఆదేశించారు. మీ కోసం కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ప్రతి ఒక్క అర్జీ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వాటికి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆర్జీలను నిర్దేశించిన గడువులోపు పరిష్కరించాలని. ఎట్టి పరిస్థితిల్లోనూ అర్జీలు పెండింగ్ ఉండరాదని అధికారులకు స్పష్టం చేశారు. అధికారులు ప్రతి రోజు లాగిన్ అయి ఆన్ లైన్ లో వచ్చిన వినతులను చూడాలని. రీ ఓపెన్ కేసులు రాకుండా చూడాలని ఆయన ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డి. ఆర్. ఓ బి.చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటి కలెక్టర్ లు కుమార్, శ్రీధర్, వరకుమార్, డిప్యూటి కలెక్టరు పార్ధసారధి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


