కేసుల ట్రయిల్ లో శిక్షల శాతం పెంచడమే లక్ష్యం – కోర్ట్ మానిటరింగ్ సిబ్బందితో సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ – కేసుల్లో నిందితులకు శిక్షలు పడి బాధితులకు సరైన న్యాయం అందేలా పోలీసులు కృషి చెయ్యాలి – పోలీసు స్టేషన్లు, న్యాయస్థానాల మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తూ అంకితభావంతో పనిచేస్తూ శిక్షల శాతం పెంచే విధంగా శ్రమించాలి -ఎస్పీ ఏ.ఆర్ దామోదర్

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులలో నేరస్తులకు శిక్షలు పడటంలో కోర్ట్ మానిటరింగ్ సిబ్బంది విధులు చాలా కీలకమని జిల్లా ఎస్పీ ఎస్పీ ఏ.ఆర్ దామోదర్
అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ స్టేషన్ల కోర్ట్ సిబ్బంది, కోర్ట్ లైజన్ సిబ్బందితో ఈ సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్పీ ఏ.ఆర్ దామోదర్
కోర్టు ట్రయిల్ వివిధ దశల్లో ఎదురవుతున్న సమస్యలు, వారి పనితీరు, ప్రస్తుత స్థితిగతుల గురించి అడిగి తెలుసుకొని వాటిని సమన్వయంతో అధిగమించేందుకు అవసరమైన అంశాలపై పోలీసు అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు తెలియచేసారు.
గ్రేవ్/నాన్ గ్రేవ్ కేసుల ట్రయల్ సమయంలో కోర్టు కానిస్టేబుళ్లు బాగా పనిచేసి కన్విక్షన్ల శాతాన్ని పెంచాలన్నారు. కోర్ట్ లో చార్జ్ షీట్ దాఖలు చేసిన వెంటనే
సి సి ,పి ఆర్ సి , ఎస్. సి
నంబర్స్ తీసుకోవాలని, సమన్లు సకాలంలో అందజేయాలని, సాక్షులకు కోర్టులో సాక్ష్యం చెప్పే విధంగా మోటివేట్ చేయాలని, సాక్షుల వాంగ్మూలాలు, లేదా సాంకేతిక మరియు వైద్య అధారాను సేకరించి వాటి సరైన పద్దతిలో కోర్టుకు సమర్పించాలని, సంబంధిత పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో సత్సంబంధాలు కొనసాగించాలని, అదే విధంగా వారెంట్స్ పెండింగ్ లేకుండా చూసుకోవాలని, ఆయా కేసులలో నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేయాలన్నారు. కోర్ట్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం క్రమానుగత అధికారులకు తెలియచేయాలన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

పోలీసు స్టేషన్ లలో నమోదయ్యే కేసుల వివరాలను మరియు కేసుకు సంబంధించిన అన్ని వివరాలను సి సి టి ఎన్ ఎస్ లో ఎప్పటికప్పుడు పొందుపరచాలన్నారు. వివరాల నమోదు వల్ల కేసులు, వ్యక్తుల పూర్తి సమాచారం తెలుస్తుందని అరెస్టు సమాచారం మరియు దర్యాప్తు పురోగతి అది అందరికీ ఉపయోగపడేలా దోహదం చేస్తుందన్నారు. కోర్టు లైజన్ సిబ్బంది పోలీసు స్టేషన్‌కు, న్యాయస్థానాల మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తూ నిబద్ధతతో పనిచేయాలని, కోర్టుకు సంబంధించిన ఎలాంటి రికార్డులు పెండింగ్‌లో పెట్టవద్దని, ఎప్పటికప్పుడు రికార్డులను చెక్‌ చేసుకోవాలని సూచించారు. ఎప్పుడైతే నేరం చేసిన వారికి శిక్ష పడుతుందో అప్పుడే బాధితులకు సరైన న్యాయం జరుగుతుందని తద్వారా ప్రజలకు పోలీసులపై, న్యాయస్థానంపై నమ్మకం కలుగుతుందని జిల్లా ఎస్పీ ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ పేర్కొన్నారు. లోక్ అదాలత్ సమయంలో సమర్థవంతంగా విధులు నిర్వహించి అత్యధిక కేసుల పరిష్కారంలో కీలక పాత్ర పోషించాలన్నారు. బాగా విధులు నిర్వహించిన వారికి రివార్డ్స్ ఉంటాయన్నారు.
నేరస్తులకు శిక్ష పడడంలో కోర్టు కానిస్టేబుల్ ల పాత్ర చాలా కీలకమైదని, కోర్టులో బాధితులకు న్యాయం జరిగేలా, నేరస్తులకు శిక్ష పడేలా చూడడంలో కోర్టు కానిస్టేబుళ్లు ముఖ్య పాత్ర వహించాలన్నారు. జిల్లా ఎస్పీ సిబ్బంది యొక్క సమస్యలను విని వాటిని పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
సమావేశంలో డిసిఆర్బీ సీఐ దేవప్రభాకర్, ఎస్సై లు వెంకటేశ్వర్లు, వేణు గోపాల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *