ప్రధాన రహదారులు, రైల్వే మార్గాల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేసుకొని పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

జిల్లా నుంచి వెళుతున్న ప్రధాన రహదారులు, రైల్వే మార్గాల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేసుకొని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా
చెప్పారు. ఆయా అంశాలపై మంగళవారం జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల కృష్ణతో కలసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. 565, 544(D), 167(B), 765, 544 (G) 5, -2 కాళహస్తి రైల్వే మార్గాల నిర్మాణ ప్రాజెక్టులపై చర్చించారు. ఆయా నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ కోసం నిధుల చెల్లింపు, పెండింగ్ క్లెయిమ్స్, యాజమాన్య హక్కుల వివాదాలపై కలెక్టర్ ఆరా తీశారు. వీటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని, నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను ఇందుకోసం రూపొందించుకోవాలని చెప్పారు. వీటి పురోగతిపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు. క్షేత్ర స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల ప్రజలకు పరిహారము, పునరావాస కేంద్రాల ఏర్పాటు, నిధుల చెల్లింపులపైనా కలెక్టర్ ఆరా తీశారు. కొత్తపట్నం మండలంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు భూసేకరణపైన ఈ సమావేశంలో చర్చించారు. పాదర్తి, గుండాయపాలెం, పిన్నివారిపాలెం తదితర గ్రామాలలో భూముల లభ్యతను ప్రభుత్వము దృష్టికి తీసుకువెళ్ళి అవసరాన్ని బట్టి వాటిని సేకరించే విషయంలో ఒక స్పష్టత తీసుకోవాలని ఈ సందర్భముగా నిర్ణయించారు.
సమావేశంలో డిఆర్ఓ బి. చిన ఓబులేసు, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట్ త్రివినాగ్, కనిగిరి , ఒంగోలు ఆర్డీవోలు వెంకట శివరామిరెడ్డి, లక్ష్మీ ప్రసన్న, పలువురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు, ఎన్ హెచ్ ఎ ఐ అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *