బేగంపేట ,మే 26,(జే ఎస్ డి ఎం న్యూస్) :
జూన్ 2 న నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని ఎమ్మెల్యే కార్యాలయంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కే సి ఆర్ నాయకత్వం లో 2001 లో టి ఆర్ ఎస్ పార్టీ ఏర్పడిందని తెలిపారు. అనేక పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2 న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని వివరించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గా కే సి ఆర్ నాయకత్వం లో ఎంతో అభివృద్ధి చేసుకున్నామని, దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని చెప్పారు. అంతటి విశిష్టత గల జూన్ న బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎంతో ఘనంగా నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని అన్నారు. ఈ సమావేశంలో సనత్ నగర్ కార్పొరేటర్ కొలన్ లక్ష్మి, మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, కొలన్ బాల్ రెడ్డి, గుర్రం పవన్ కుమార్ గౌడ్, ఆకుల హరికృష్ణ, హన్మంతరావు, శ్రీనివాస్ గౌడ్, వెంకటేషన్ రాజు, నాయకులు అశోక్ యాదవ్, శ్రీహరి, నామన సంతోష్ కుమార్, ప్రవీణ్ రెడ్డి, కిషోర్, నాగులు, లక్ష్మీపతి, రమణ, శేఖర్, ఆరీఫ్, శ్రీకాంత్ రెడ్డి, ఖలీల్, కూతురు నర్సింహ, బలరాం, తదితరులు పాల్గొన్నారు.


