వర్షాకాల నేపద్యం లో భద్రతా సమీక్ష………రైలు కార్యకలాపాల నిర్వహణలో మరింత అప్రమత్తత అవసరం…..దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్.

హైదరాబాద్ ,మే 26,(జే ఎస్ డి ఎం న్యూస్ ప్రధాన ప్రతినిధి):
వర్షాకాలం దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వేలో రాబోతున్న రుతుపవనాల సంసిద్ధతపై దక్షిణ మధ్య .రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సమీక్షించారు.సోమవారం సికింద్రాబాద్ రైలు నిలయం లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ రైళ్లను నడుపుతున్నప్పుడు అనుసరించాల్సిన అన్ని భద్రత జాగ్రత్తలను తెలియజేశారు. భద్రతకు సంబంధించిన విధివిధానాలను తరచుగా తనిఖీ చేయడం ద్వారా అన్ని స్థాయిలలో ప్రయాణికులు భద్రతపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సంఘవిద్రోహశక్తుల కార్యకలాపాల నుండి ట్రాక్ భద్రతను పెంపొందించేందుకు ప్రజలకు ఆర్పిఎఫ్ పలకాలను ట్రాక్ పెట్రోలింగ్ సిబ్బందిని నియమించడం ద్వారా ట్రాక్ పెట్రోలింగ్ మరింత బలోపేత చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు రైలు మరియు రోడ్డు ప్రయాణికులు భద్రతను నిర్ధారించడానికి జోన్ లోని లెవెల్ క్రాసింగ్ ల వద్ద ప్రామాణిక భద్రత ప్రోటోకాళ్లను కచ్చితంగా పాటించాలని ఆయన సిబ్బందికి సూచించారు పారదర్శకతను నిర్ధారించడానికి ప్రైవేట్ సైడింగులతో సహా జోన్ అంతట సీసీటీవీల ఏర్పాటుపై ఈ సందర్భంగా అరుణ్ కుమార్ జాయిన్ ఎలక్ట్రానిక్ డ్రాయింగ్ అప్రూవల్ సిస్టం ఒక్క కొత్త వెర్షన్ 2.0 ను ప్రారంభించారు.ఇది ఇంజనీరింగ్ డ్రాయింగ్ కు సంబంధించిన డేటాబేస్ ను నిర్వహించడం అధికార ఆమోదం పొందేందుకు సహాయపడుతుందని, ఇది కాగిత రహిత పనిని ప్రోత్సహిస్తుందని, సమయం మరియు డబ్బును ఆదా చేస్తుందన్నారు. ఈ సమీక్ష సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ నియర్ అగ్రవాల్ తోపాటు దక్షిణ మధ్య రైల్వేకు చెందిన వివిధ శాఖలకు చెందిన ప్రధాన అధిపతులు మరియు సికింద్రాబాద్ హైదరాబాద్ విజయవాడ గుంతకల్లు గుంటూరు నాందేడ్ కు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *